: ఐదేళ్లలో గంగానది ప్రక్షాళన పూర్తి కావచ్చు: జవదేకర్
పవిత్ర గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని... మరో ఐదేళ్లలో ప్రక్షాళన పూర్తి కావచ్చని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. నదిని శుద్ధి చేసే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఐదేళ్లలో గంగానదిలోకి ఎలాంటి కాలుష్య పదార్థాలు చేరకుండా చూస్తామని తెలిపారు. దేశంలోని ఇతర నదులను కూడా శుభ్రం చేస్తామని వెల్లడించారు. 17 పారిశ్రామిక రంగాల నుంచి వెలువడుతున్న వ్యర్థపదార్థాలు వచ్చి చేరుతుండటంతో గంగానది కలుషితమవుతున్నట్టు గుర్తించామని చెప్పారు.