: కొమరం భీమ్ ను చంపింది నిజాం కాదు: నాయిని
ఇటీవల కాలంలో నిజాంను టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తిస్తుండటంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రజాకార్ల ద్వారా అరాచకాలను సృష్టించిన నిజాంను ఎలా పొగుడుతారంటూ నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి విపక్షాలపై మండిపడ్డారు. నిజాం పాలనలో చిన్నచిన్న పొరపాట్లు జరిగినప్పటికీ, 99శాతం మంచి పాలనే అందించారని కొనియాడారు. కొమరం భీమ్ ను నిజాం చంపలేదని స్పష్టం చేశారు. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రభుత్వానికి ఎంఐఎం కొన్ని అంశాలపై మాత్రమే మద్దతు ఇస్తోందని... కొన్ని విషయాల్లో తమపై విమర్శలు కూడా చేసిందని చెప్పారు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికే టీడీపీ, కాంగ్రెస్ నేతలు తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.