: స్థానికుల సమాచారంతో 30 బాంబులు స్వాధీనం
స్థానికులు అందించిన సమాచారంతో దాడులు చేసిన పోలీసులు ఏకంగా 30 బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రం కిషన్ గంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఉదయం పోలీసులకు స్థానికుల నుంచి సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహించగా... ఓ చెరువులో 30 బాంబులు దొరికాయి. అయితే, చాలా కాలం నుంచి వీటిని నీటిలో ఉంచడంతో అవి మందకొడి స్థితికి చేరుకున్నాయి. ఈ బాంబులన్నీ స్థానికంగానే తయారు చేశారని... అయినప్పటికీ, ఇవన్నీ చాలా శక్తిమంతమైనవని పోలీసులు తెలిపారు.