: మందు తాగి చిందులేశారు... సస్పెండ్ అయ్యారు


నూతన సంవత్సర వేడుకల పేరిట డిసెంబర్ 31వ తేదీ రాత్రి కార్యాలయంలోనే తప్పతాగుతూ, చిందులేసిన ఉద్యోగులు చివరకు సస్పెన్షన్ కు గురయ్యారు. హైదరాబాద్ నగరంలోని మౌలాలి అగ్నిమాపక కేంద్రంలో డ్యూటీలో ఉన్న నలుగురు సిబ్బంది మందు కొడుతూ చిందులేసిన వీడియో... న్యూస్ చానళ్లలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త పలు వార్తా పత్రికలలో కూడా వచ్చింది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. డిపార్ట్ మెంట్ ప్రతిష్ఠను మంటకలిపిన నలుగురినీ సస్పెండ్ చేస్తూ డీఎఫ్ వో పాపయ్య ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News