: తమిళ సినీ దర్శకుడు శంకర్‌కు ఇళయరాజా లీగల్ నోటీసులు


తను స్వరపరచిన పాటను అనుమతి లేకుండా ‘కప్పాల్' అనే సినిమాలో వాడినందుకుగాను ‘ఐ' చిత్ర దర్శకుడు శంకర్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. 1989లో విడుదలైన తమిళ చిత్రం 'కరగాట్టక్కారాన్'లోని ‘ఒరు వీట్టూ ఒరు వాందూ' పాటను రీమిక్స్ చేసి వాడుకున్నారు. అనుమతి లేకుండా ఈ పాటను వాడుకోవడంపై కోపంతో ఉన్న ఇళయరాజా, తన న్యాయవాది ఎస్.కే.రఘునాథన్ ద్వారా శంకర్‌కు చెందిన ‘ఎస్ పిక్చర్స్' సంస్థకు నోటీసులు పంపించారు. అయితే, ఆ పాట హక్కులను కలిగివున్న 'ఆగి మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్' నుంచి తాము రీమిక్స్ రైట్స్ తీసుకున్నామని ఎస్ పిక్చర్స్ చెబుతోంది. అయితే, తన క్లయింట్ ఇళయరాజా స్వరపరిచిన గీతాలను ఏ విధంగానూ వాడుకోకుండా మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని రఘునాథన్ తెలిపారు. ఆగి మ్యూజిక్ సంస్థకు ఎటువంటి పబ్లిషింగ్, యాజమాన్య హక్కులు లేవని వివరించారు. కాగా, తన అనుమతి లేకుండా పాట వాడుకున్నందుకు తగిన పరిహారం చెల్లించాలని, లేకుంటే సినిమా నుండి ఆ పాటను తొలగించాలని ఇళయరాజా డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News