: విజయనగరంలో విమానాశ్రయం: అశోక్ గజపతిరాజు
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. అన్ని అనుమతులు పూర్తి స్థాయిలో లభించి పనులు మొదలుపెట్టేందుకు కొంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి నిధులను ప్రజల అవసరాల మేరకు ఖర్చు చేస్తానని ఆయన పేర్కొన్నారు. నేటి ఉదయం గజపతి నగరంలో మార్కెట్ కమిటీ అదనపు గోదాంను ఆయన ప్రారంభించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి విమానాశ్రయాల అభివృద్ధికి ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తాత్కాలిక అవసరాలకు మాత్రమే వాటిని వినియోగించుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.