: పైరసీ సీడీల ప్రధాన సూత్రధారి అరెస్టు
పైరసీ సీడీల కీలక సూత్రధారి, గుంటూరుకు చెందిన కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న(శుక్రవారం) బెంగళూరులో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ ఉదయం నిందితుడి స్వస్థలం వినుకొండకు తీసుకువచ్చారు. డిసెంబరు 12న వినుకొండలోని కృష్ణారెడ్డి నివాసంలో తనిఖీ చేసిన పోలీసులు పైరసీ సీడీలు, కంప్యూటర్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.