: త్వరలో మన్మోహన్ ను ప్రశ్నించనున్న సీబీఐ


హిందాల్కో కంపెనీకి 2005లో కేటాయించిన బొగ్గు క్షేత్రాల వ్యవహారంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను సీబీఐ త్వరలో ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ తిరస్కరించాక కూడా ఓ ప్రైవేట్ సంస్థకు బొగ్గు క్షేత్రాలను ఎలా కేటాయించారని, ఏ అర్హత ఆధారంగా ఇచ్చారని సీబీఐ అధికారులు నాడు బొగ్గు మంత్రిత్వ శాఖను పర్యవేక్షించిన మన్మోహన్ ను ప్రశ్నించనున్నారు. అంతేగాక, 2013లో హిందాల్కోపై ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ఆరోపణలకు సంబంధించి కూడా ప్రశ్నించవచ్చని సమాచారం. అటు, బొగ్గు క్షేత్రాలు కేటాయింపుకు నిరాకరించినప్పటికీ పీఎంవో ద్వారా అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరేఖ్ కు రెండు లేఖలు రాయడం, తరువాత హిందాల్కో ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో మన్మోహన్ వ్యక్తిగతంగా సమావేశం కావడం, ఆ వెంటనే అంగీకారం తెలపడంపైనా విచారణ సమయంలో అడిగే అవకాశముంది. ఈ కేసులో మన్మోహన్ ను కూడా విచారించాల్సిన అవసరం ఉందని గతేడాది డిసెంబరులో సుప్రీంకోర్టు సీబీఐకి తెలిపింది.

  • Loading...

More Telugu News