: వారి కోసం 18 గంటలు వేటాడారు!


పాకిస్థాన్ కు చెందినదిగా భావిస్తున్న బోటు డిసెంబర్ 31న భారత సముద్ర జలాల్లో ప్రవేశించడం, దాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ వెంబడించడం, ఆ బోటులోని సిబ్బంది తమను తాము పేల్చేసుకోవడం తెలిసిందే. అయితే, ఈ ఆపరేషన్ మొత్తం 18 గంటల పాటు సాగిందట. ఆ రోజు ఉదయం 9.30కి అనుమానాస్పద బోటు గురించి నిఘా సంస్థలు ఇండియన్ కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించాయి. పాక్ నుంచి వచ్చిన కొన్ని ఫోన్ కాల్స్ ఆధారంగా బోటు వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించారు. ఆ వెంటనే నేవీకి చెందిన డోర్నియర్ విమానంతో ఆ బోటును వెదికేందుకు రంగంలోకి దిగారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆ బోటును గుర్తించారు. అప్పటికే అది భారత సముద్ర జలాల్లో ప్రవేశించింది. దీంతో, కోస్ట్ గార్డ్ కు చెందిన రాజ్ రతన్ నౌకను ఆ బోటును వేటాడేందుకు పంపారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది హెచ్చరికలు చేయడంతో బోటును దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అందులోని దుండగులు. 'కోస్ట్ గార్డ్' నుంచి తప్పించుకునేందుకు పలుమార్లు దిశను మార్చుకునే యత్నం చేశారు. ఇలా, గంటసేపు సాగింది. ఇంధనం అయిపోవడంతో బోటును నెమ్మదిగా నడిపారు. చివరకు తెల్లవారుజామున 3.00 గంటల వేళ బోటు పైభాగంలోకి నలుగురు వ్యక్తులు రాగా, ఆ వెంటనే బోటు పేలిపోయింది. కావాలనే వారు తమను తాము పేల్చేసుకున్నారని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News