: ప్రధాన పోస్టాఫీసుల్లో శ్రీవారి దర్శనం టికెట్లు
తిరుమల వెంకన్న దర్శనం టికెట్లు ఇక పోస్టాఫీసుల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 5 నుంచి ఆంధ్రప్రదేశ్ లో 29, తెలంగాణ రాష్ట్రంలోని 29 ప్రధాన పోస్టాఫీసుల్లో దర్శన టికెట్లు విక్రయించనున్నట్టు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా రూ.50, రూ.300 టికెట్లు విక్రయిస్తారు. ఈ పథకం శ్రీవారి భక్తులకు సంతోషం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే తిరుమల వెళ్లి అక్కడి క్యూ లైన్లలో గంటలకొద్దీ నిల్చోవడం శ్రమతో కూడిన విషయం. ఇప్పుడు దగ్గర్లోని ప్రధాన పోస్టాఫీసుకెళ్లి, కొద్ది సమయంలోనే టికెట్ ను పొందే వీలుంటుంది.