: ఆ బాలికను తనయుడు వేధించాడు... తండ్రి కాల్చేశాడు!


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. లక్నోలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికను సహ విద్యార్థి గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. వేధింపులు తారస్థాయికి చేరుతుండడంతో బాలిక అతడిపై స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో, ఆ బాలుడిని స్కూలు యాజమాన్యం ఐదు రోజులపాటు సస్పెండ్ చేస్తూ, ఆ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన బాలుడి తండ్రి బాలికను తుపాకీతో కాల్చాడు. దీంతో ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. కాగా, బాలుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News