: ఇకపై ప్రతి శనివారం ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఏపీ సీఎం


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక నుంచి ప్రతి శనివారం ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి హైదరాబాదులోని లేక్ వ్యూలో ఆయన వారిని కలుస్తారు. ఈ సందర్భంగా పలు విషయాలు, తమ నియోజకవర్గ సమస్యలను సీఎంతో ప్రజాప్రతినిధులు చర్చించవచ్చు. సచివాలయంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రన్న సంక్రాంతి కానుక, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్ సీ అమలుపై మంత్రివర్గం చర్చిస్తోంది.

  • Loading...

More Telugu News