: ఎంసెట్ పై నోటిఫికేషన్ ఇవ్వాల్సింది తెలంగాణ ప్రభుత్వమే!: మంత్రి జగదీశ్ రెడ్డి
ఎంసెట్ పై ఇప్పటివరకు అమలవుతున్న విధానాన్నే కొనసాగిస్తామని గవర్నర్ కు చెప్పామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. గవర్నర్ తమ వివరణకు సంతృప్తి చెందారన్నారు. అయితే, ఎంసెట్ పై ఏపీ ఉన్నత విద్యామండలి ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి తప్పు చేసిందని మీడియా సమావేశంలో మంత్రి వ్యాఖ్యానించారు. అసలు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ సంప్రదించలేదని చెప్పారు. తాము చట్టానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని, 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందన్న విషయం ఏపీ ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా వాళ్లు చెప్పినట్టే నడవాలంటే ఎలా? అని మంత్రి ప్రశ్నించారు. ఇక, తమ ఎంసెట్ ను తామే నిర్వహించుకుంటామని, అడ్మిషన్ల ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదనీ అన్నారు.