: 33 ఏళ్లలో వంద రెట్లు పెరిగిన ఫ్లాట్ల ధరలు: ఢిల్లీ వాసులకు డీడీఏ షాక్


ఢిల్లీలోని రోహిణి రెసిడెన్సియల్ స్కీమ్ వాసులకు ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ (డీడీఏ) షాకిచ్చింది. నివాస స్థలాల రేట్లను ఒకేసారి వంద రెట్లు పెంచి మరీ నోటీసులను జారీ చేసిన డీడీఏ తీరుపై ఢిల్లీ వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 1981లో విక్రయించిన స్థలాలకు సంబంధించి పెంచిన ధరలను చెల్లించాలంటూ జారీ అయిన ఆ నోటీసులు ఢిల్లీ వాసులనే కాక దేశాన్నే విస్మయానికి గురి చేస్తున్నాయి. అసలు విషయానికొస్తే... రోహిణి రెసిడెన్సియల్ స్కీమ్ లో చదరపు మీటరు స్థలాన్ని రూ.100 నుంచి 200 మధ్య రేట్లకు వినియోగదారులకు డీడీఏ స్వాధీనం చేసింది. అయితే స్వాధీనతా పత్రాలను మాత్రం జారీ చేయలేదు. వాటి కోసం స్థలాల హక్కుదారులు దాదాపు 33 ఏళ్లపాటు నిరీక్షించాల్సి వచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాతైనా స్వాధీనతా పత్రాలు దక్కాయిలే అనుకుంటూ సదరు పత్రాలను తెరచిచూసిన రోహిణీ రెసిడెన్సియల్ నివాసితులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. 33 ఏళ్ల క్రితం అప్పగించిన స్థలాల రేట్లను చదరపు మీటరుకు రూ.14,120కు పెంచుతూ, పెంచిన ధరల మేరకు సొమ్ము చెల్లించాలంటూ వారికి నోటీసులు జారీ చేసింది. దీనిపై రోహిణీ రెసిడెన్సియల్ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక లబ్ధిదారులు చెల్లించిన సొమ్ముకు ఏడు శాతం వడ్డీ చెల్లిస్తామని చెప్పిన డీడీఏ తాజాగా ఐదు శాతం వడ్డీనే లెక్కించిందట.

  • Loading...

More Telugu News