: బీజేపీకి త్వరలో ఐదుగురు కొత్త ప్రధాన కార్యదర్శులు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా త్వరలో కొత్త ప్రధాన కార్యదర్శులను నియమించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఐదు ప్రధాన కార్యదర్శుల పదవులు ఖాళీ ఉన్నాయని, కొన్ని రోజుల్లో వాటిని భర్తీ చేయనున్నట్టు సమాచారం. పార్టీ జాతీయ కార్యనిర్వాహకవర్గ సమావేశం త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నియామకాలు చాలా ముఖ్యమని బీజేపీ అంటోంది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా కొన్ని వారాల్లో జరిగే అవకాశం ఉంది. అందుకే ముందుగానే కొత్త జట్టును నియమించాలని షా భావిస్తున్నారు.