: మినిస్టర్ క్వార్టర్స్ లో హరీశ్ రావుతో జయప్రద భేటీ
నటి, మాజీ ఎంపీ జయప్రద ఈ ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావుతో భేటీ అయ్యారు. హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆమె హరీశ్ ని కలిసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇప్పించాలని జయప్రద ఈ సందర్భంగా కోరినట్టు సమాచారం. అయితే, న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకే ఆమె తనను కలిశారని హరీశ్ రావు తెలిపారు.