: బుర్ద్వాన్ లో మరో పేలుడు: నాటు బాంబులు పేలి ఇద్దరికి గాయాలు


పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ లో మరో పేలుడు ఘటన చోటుచేసుకుంది. బుర్ద్వాన్ పరిధిలోని దుర్గాపూర్ లో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న నాటు బాంబుల పేలుడులో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గతేడాది బుర్ద్వాన్ లోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు బాంబులు తయారుచేస్తున్న క్రమంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాటి ఘటనలో పేలుడు పదార్థాల తయారీలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు మృత్యువాత పడగా, మరొకరు గాయపడ్డ సంగతి తెలిసిందే. నాటి ఘటనలో పోలీసులు 55 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా జరిగిన ఘటన కూడా బాంబుల తయారీ సందర్భంగానే చోటుచేసుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News