: మీడియాపై మడోనా మండిపాటు


పాప్ లెజెండ్ మడోనా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ధీర వనితల మధ్య చిచ్చు పెట్టేందుకు మీడియా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. తనకు, లేడీ గాగాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ పాప్ క్వీన్ స్పష్టం చేసింది. 'టు స్టెప్స్ బిహైండ్' గీతంలో లేడీ గాగాను అవమానించలేదని తెలిపింది. ఇంకా మహిళలపై వివక్ష కొనసాగుతున్న ప్రపంచంలోనే బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఇబ్బంది పెట్టాలని కొందరు భావించారని, వారు ఆ పని చేయలేరని పేర్కొంది. అసలిదంతా మీడియా సృష్టేనని మండిపడింది. ఇటీవలే మడోనా తాజా గీతం లీకవడం, దాంట్లో లేడీ గాగాను 'కాపీ క్యాట్' అని పేర్కొన్నారంటూ వార్తలు రావడం తెలిసిందే.

  • Loading...

More Telugu News