: నేడు ఏపీ కేబినెట్ భేటీ: పీఆర్సీపై తుది నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేటి మధ్యాహ్నం భేటీ కానుంది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగులంతా ఈ భేటీ సమాచారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్మార్ట్ ఏపీ, స్మార్ట్ విలేజ్ కార్యక్రమాలపైనా ఈ భేటీలో చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, ఎంసెట్ నిర్వహణ తదితర అంశాలు కూడా భేటీలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News