: మాజీ నెంబర్ వన్ ను చిత్తు చేసిన తెలుగుబాల
భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధు తనకన్నా మెరుగైన క్రీడాకారిణిని చిత్తు చేసింది. తైపేలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సింధు.. చైనాకు చెందిన మాజీ ప్రపంచ నెంబర్ వన్, మూడో సీడ్ షిజియాన్ వాంగ్ పై విజయభేరి మోగించింది. దీంతో, సింధు మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ గంటపాటు సాగింది.