: ఇక చిటికెలో టీడీపీ కార్యకర్తల సమస్యల పరిష్కారం... కాల్ సెంటర్ ను ప్రారంభించనున్న లోకేష్


కార్యకర్తల సంక్షేమంపై ఇతర రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్న టీడీపీ తాజాగా మరింత మెరుగైన చర్యల కోసం రంగం సిద్ధం చేసింది. కార్యకర్తలకు ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను పార్టీ కార్యకర్తల సంక్షేమ సెల్ చీఫ్ నారా లోకేశ్ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన కాల్ సెంటర్ ను ప్రారంభిస్తారు. ఇకపై తమ సమస్యలను కార్యకర్తలు ఈ కాల్ సెంటర్ ద్వారా పార్టీ అధిష్ఠానానికి నివేదించవచ్చు. కార్యకర్తల నుంచి స్వీకరించే సమస్యలను త్వరితగతిన పరిష్కారమయ్యేలా ఈ కాల్ సెంటర్ చర్యలు తీసుకోనుంది.

  • Loading...

More Telugu News