: పదేళ్ల విరహం అనుభవించి వివాహమాడారు!


పదేళ్ల విరహం తరువాత ఆ జంట ఒక్కటయ్యారు. సినిమాను తలపించే ఈ సంఘటన తమిళనాడులోని తిరువొత్తియూరులో చోటుచేసుకుంది. తేని జిల్లా ఉత్తమపాళ్యం సమీపంలోని రాయపట్టికి చెందిన మరియసూసై కుమారుడు జాన్సన్ (34) శివగంగై జిల్లా ఇళయాన్ గుడిసైకి చెందిన అమల్ రాజ్ కుమార్తె లీమారోజ్ (26) ప్రేమించుకున్నారు. మధురైలో ఉన్న ఓ సంస్థలో జాన్సన్ కు ఉద్యోగం రావడంతో అతను అక్కడికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య రెండేళ్లపాటు ఫోన్ ప్రేమాయణం సాగింది. 2005లో జాన్సన్ కు జరిగిన ప్రమాదంలో ఫోన్ నుజ్జునుజ్జయిపోయింది. దీంతో వారిద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇంతలో జాన్సన్ ప్రమాదంలో మరణించినట్టు లీమారోజ్ కు సమాచారం అందింది. దీంతో అతనితో తప్ప మరొకరితో జీవితం లేదని భావించి కన్యస్త్రీగా మారాలని నిర్ణయించుకుని శిక్షణకు వెళ్లింది. ఇంతలో జాన్సన్ కనిపించడంతో తిరిగి వచ్చేసి అతన్ని ఉత్తమపాళ్యంలోని చర్చిలో వివాహం చేసుకుంది. వివాహం పూర్తికాగానే తమ తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేదని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News