: ఆస్ట్రేలియా ప్రధానితో ఫొటో సెషన్ కు హాజరుకాని ధోనీ


ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తో భారత క్రికెట్ జట్టు దిగిన ఫొటోలో మహేంద్ర సింగ్ ధోని కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నూతన సంవత్సరం సందర్భంగా భారత జట్టు గౌరవార్థం చిన్న విందును అబాట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారత, ఆస్ట్రేలియా జట్ల క్రీడాకారులు, అధికారులు హాజరైయ్యారు. అనంతరం ఫొటో సెషన్ జరుగగా, ధోనీ తప్ప మిగతా అందరూ కనిపించారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అనంతరం ధోనీ జట్టుతో పెద్దగా కలసి ఉండటం లేదని తెలుస్తోంది. అయితే ఈ విందుకు ధోనీ హాజరై ఫొటో సెషన్ కు దూరంగా ఉన్నాడా? లేక విందుకే హాజరు కాలేదా? అనే విషయం వెల్లడి కాలేదు.

  • Loading...

More Telugu News