: ఇది నిజం!... తిరుమలలో సామాన్యులకు పెద్దపీట


పర్వదినాల సమయంలో వీఐపీలకు సేవలు చేసి తరిస్తూ, విమర్శలు ఎదుర్కొనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల మైండ్ సెట్ మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సుమారు 10 వేల వరకూ పాసులు జారీచేసే టీటీడీ ఈ దఫా 2,500 కంటే తక్కువకే సరిపెట్టుకుంది. దీంతో ముందుగా అనుకున్న సమయంకన్నా 2 గంటల ముందే సామాన్య భక్తులను ఆలయం లోపలి పంపారు. సర్వదర్శనం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ప్రారంభమైంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని తాము చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని టీటీడీ ఈఓ తెలిపారు. కాగా, మొత్తం 2468 మందికి మాత్రమే టీటీడీ వీఐపీ దర్శనం కల్పించింది. వీరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వీ.రమణ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్, డీకే అరుణ, మహేందర్ రెడ్డి, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News