: రేపట్నుంచే నగదు బదిలీ పథకం అమలు
కొత్త సంవత్సరం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నగదు బదిలీ పథకం అమలు చేయనుంది. 2014 నవంబరు 15 నుంచి దేశంలోని 54 జిల్లాలలో ఈ పథకం అమలవుతోంది. కాగా, జనవరి 1 నుంచి మిగిలిన 676 జిల్లాలలో కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. వంట గ్యాస్ కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సొమ్ము రేపటి నుంచి వినియోగదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు. నగదు బదిలీ పథకంలో చేరగానే ఒక్కో గ్యాస్ కనెక్షన్ కు తొలుత 568 రూపాయలు వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. దీంతో ఇకపై వినియోగదారులు గ్యాస్ సిలిండర్ ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సిలిండర్ బుక్ చేయగానే అడ్వాన్స్ రూపంలో సబ్సీడీ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ కానుంది. ప్రస్తుతానికి 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ధర 417 రూపాయలు. కాగా, మార్కెట్ ధర 752 రూపాయలు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం ఒక్కో వినియోదారుడికి 12 సిలిండర్లకు సబ్సీడీ రానుంది.