: సీఆర్డీఏకు 34 మంది డిప్యూటీ కలెక్టర్ల నియామకం


ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కు ప్రభుత్వం 34 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. తదుపరి పోస్టింగ్ కోసం గుంటూరు కలెక్టర్ కు రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణంలో వివిధ విభాగాలకు చెందిన కీలకమైన బాధ్యతలను వీరికి కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునే సంస్థలను, పనులను వీరంతా సమన్వయం చేయనున్నట్టు సమాచారం. ఐఏఎస్ ల పర్యవేక్షణలో రాజధాని నిర్మాణం జరిగితే అందులో తప్పులు దొర్లే అవకాశం తక్కువని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News