: బాలచందర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటున్న తమిళ సినీ దర్శకుల సంఘం
ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ స్మారకార్థం విగ్రహం ఏర్పాటు చేయాలని తమిళ సినీ దర్శకుల సంఘం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. "ఎన్నో ఏళ్లు గుర్తుంచుకునేందుకు తగిన అర్హత ఉన్న వ్యక్తి బాలాచందర్ సర్. ఆయన అంత్యక్రియల సమయంలో చాలామంది తరలివచ్చారు. తన సినిమాల ద్వారా ప్రజలపై ఎంత ప్రభావాన్ని చూపారో దాని ద్వారా అర్థమవుతోంది. ఆయన జ్ఞాపకార్థం ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేమనుకుంటున్నాం" అని దర్శకుల సంఘం సభ్యుడు ఆర్.కె.సెల్వమణి పేర్కొన్నారు. అంతేగాక, మైలాపూర్ లోని ఓ వీధికి బాలచందర్ పేరు పెట్టాలని కూడా ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. అటు దర్శకుల సంఘం కార్యాలయానికి ఆయన పేరే పెట్టనున్నామని వెల్లడించారు.