: నెల రోజుల్లో ఆర్టీసీ విభజన పూర్తి: ఎండీ పూర్ణచంద్రరావు


మరో నెల రోజుల వ్యవధిలో రోడ్డు రవాణా సంస్థ విభజన పూర్తయ్యే అవకాశం ఉందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఆర్టీసీ బస్సులు మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు వాటి రంగులను మార్చాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం సంస్థకు రోజుకు రూ.3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని, అందులో అధిక భాగం పల్లెవెలుగు బస్సుల వల్లే కలుగుతోందని ఆయన అన్నారు. బస్సు డ్రైవర్లు మరింత ఇంధన పొదుపు చేసేలా చూసి తద్వారా నష్టాలు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 2014లో మొత్తం 17 వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించామని పూర్ణచంద్రరావు వివరించారు.

  • Loading...

More Telugu News