: సాంబా సెక్టార్ లో పాక్ కాల్పులు... బీఎస్ఎఫ్ జవాను మృతి
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్మూకాశ్మీర్ లోని సాంబా సెక్టార్లో ఈ మధ్యాహ్నం పాక్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాను మృతి చెందినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. పాక్ కాల్పులను బీఎస్ఎఫ్ జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారని చెప్పారు.