: స్వైన్ ఫ్లూ కారణంగా ఒక్కరూ మరణించలేదు... స్పష్టం చేసిన తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కారణంగా ఎవరూ మరణించలేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డి.సాంబశివరావు తెలిపారు. స్వైన్ ఫ్లూ వ్యాప్తిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ 851 మంది రక్త నమూనాలు పరీక్షించగా, అందులో 81 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. మరణించిన 8 మందికీ స్వైన్ ఫ్లూతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నాయని వివరించారు.