: ఈ పైలట్ ను ఏ విధంగా చంపుదాం?: ఐఎస్ఐఎస్ ట్వీట్
గతవారం బందీగా పట్టుకున్న జోర్డాన్ పైలట్ ను ఏ విధంగా చంపాలో చెప్పండంటూ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు ట్విట్టర్లో అభిప్రాయాలు కోరుతోంది. ఈ ట్వీట్ కు వేలాదిగా స్పందనలు వచ్చాయట. ఐఎస్ఐఎస్ కొన్ని ఫొటోలను కూడా ట్విట్టర్లో పోస్టు చేసింది. డిసెంబర్ 24న జోర్డాన్ యుద్ధ విమాన పైలట్ మువాత్ అల్-కసాబేను మిలిటెంట్లు బందీగా పట్టుకున్నారు. ఎఫ్-16 ఫైటర్ జెట్ ను మిలిటెంట్లు ఓ క్షిపణి సాయంతో కూల్చివేయగా, కసాబే ఉత్తర సిరియాలోని యూఫ్రేట్స్ నదిలో పడిపోయాడు. కాగా, బందీగా పట్టుకున్న ఈ పైలట్ తో ఇంటర్వ్యూను కూడా ఐఎస్ఐఎస్ తన 'దబీఖ్' మాసపత్రికలో ప్రచురించింది.