: ముషార్రఫ్ పై హత్యాయత్నం చేసిన నిందితుడిని ఉరి తీసిన పాక్


పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ పై హత్యాయత్నం చేసిన నిందితుడిని ఆ దేశ జైళ్ల శాఖ నేటి ఉదయం ఉరి తీసింది. పెషావర్ సెంట్రల్ జైలులో నియాజ్ మొహ్మద్ ను ఉరి తీసినట్లు ‘డాన్ ఆన్ లైన్’ కొద్దిసేపటి క్రితం తెలిపింది. పాక్ వైమానిక దళంలో జూనియర్ టెక్నీషియన్ గా పనిచేసిన నియాజ్, ముషార్రఫ్ పై హత్యాయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అతడికి మరణశిక్ష విధిస్తూ గతంలోనే పాక్ కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఖైబర్ ప్రాంతంలోని స్వాబీ జిల్లాకు చెందిన నియాజ్ మొహ్మద్ ను పాక్ అధికారులు నిన్నటి దాకా హరిపూర్ సెంట్రల్ జైల్లో ఉంచారు. ఆ సాయంత్రం అతడిని హెలికాఫ్టర్ లో పెషావర్ జైలుకు తరలించారు. నియాజ్ మొహ్మద్ ఉరి నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే పెషావర్ సెంట్రల్ జైలు పరిధిలో ట్రాఫిక్ ను నిషేధించారు. నేటి ఉదయమే అతడికి జైలు అధికారులు ఉరిశిక్షను అమలు చేశారు.

  • Loading...

More Telugu News