: వందేళ్లయినా కేసీఆర్ దరిదాపులకు రాలేరు: తెలంగాణ విద్యామంత్రి


తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వస్తున్న ఆలోచనలు వందేళ్లయినా కాంగ్రెస్, టీడీపీ నాయకులకు రావని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళేలా ఆయనకున్న విజన్ జానారెడ్డి, పొన్నాలతోపాటు ఆంధ్ర నాయకులు చెప్పినట్టు వినే టీడీపీ నాయకులెవరికీ వందేళ్లయినా రాదని అన్నారు. ఆయన ఆలోచనా విధానం దరిదాపులకు కూడా రాలేరని చురకంటించారు. గత ప్రభుత్వాలు పెన్షన్‌ల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేస్తే, కేసీఆర్ సర్కారు రూ.4 వేల కోట్లు కేటాయించినట్టు ఆయన గుర్తు చేసారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News