: పాలనపై టీఆర్ఎస్ పట్టు కోల్పోయింది: డాక్టర్ కె.లక్ష్మణ్


పరిపాలనపై టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయిందని బీజేపీ శాసనసభా పక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో పాలన గాడిన పడలేదని అన్నారు. ప్రణాళికా వ్యయంలో భాగంగా ఇప్పటి వరకు కేవలం రూ. 10 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని... మిగిలిన రూ. 38 వేల కోట్లను మూడు నెలల్లో ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. విద్యార్థులు, ఉద్యోగులపై లాఠీ చార్జి మాత్రం చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. అభివృద్ధి పనులు జరగటం లేదని విమర్శించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పుకున్న టీఆర్ఎస్... ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించలేకపోయిందన్నారు.

  • Loading...

More Telugu News