: కాంగ్రెస్ లోనే ఉంటా... కానీ, కేసీఆర్ ను మాత్రం విమర్శించను: కోమటిరెడ్డి


తెలంగాణ కాంగ్రెస్ నేత, శాసనసభలో ఆ పార్టీ ఉపనేత అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన రూటే సపరేటు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడనంటున్న ఆయన... టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాత్రం విమర్శించనని స్పష్టం చేశారు. నల్గొండలో తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి వాటి కోసం కేసీఆర్ రూ. 170 కోట్లు మంజూరు చేశారని... అలాంటప్పుడు ఆయనను విమర్శించాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. తన కుమారుడి స్మారకార్థం నిర్మించిన భవనాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్ అనేక పనులు చేస్తున్నారంటూ కోమటిరెడ్డి కొనియాడారు.

  • Loading...

More Telugu News