: హైప్ ఎక్కువైపోయింది...నాకు ఇష్టం ఉండదు: శంకర్


తాను తీసిన సినిమాల గురించి ముందుగా చెప్పడం ఇష్టం ఉండదని 'ఐ' సినిమా దర్శకుడు శంకర్ తెలిపాడు. 'ఐ' సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తెలుగు సినీ అభిమానుల కోసం ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా తీస్తానని అన్నారు. తన సినిమాలన్నింటినీ ఆదరిస్తున్న తెలుగు సినీ అభిమానులకు ఏం చేయగలనని ఆయన పేర్కొన్నారు. విక్రమ్ లాంటి వ్యక్తి సినిమా పట్ల చూపించే అపేక్షను ఎలా చెప్పాలో తెలియడం లేదని ఆయన పేర్కొన్నారు. సినిమా గురించి హైప్ పెరిగిపోయిందని, అయినప్పటికీ సినిమా అంచనాలను అందుకుంటుందని శంకర్ వివరించారు. తాను రాజమౌళి 'మగధీర' చూసి అభిమానిగా మారిపోయానని, 'ఈగ' చూసిన అనంతరం మరింత అభిమానం పెరిగిందని, 'బాహుబలి' సినిమా కోసం తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News