: మోక్షజ్ఞ హత్య కేసులో పురోగతి


ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన మోక్షజ్ఞ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఏడాది బాలుడు మోక్షజ్ఞ కృష్ణానదిలో శవమై తల్లిదండ్రులకు లభించాడు. కిడ్నాప్, హత్య కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, బాలుడి తల్లి ఆరోపణలతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీంతో, బాలుడి పుట్టుకతో తండ్రికి గండముందని జ్యోతిష్యుడు చెప్పడంతో బాలుడ్ని పథకం ప్రకారం అంతమొందించారని తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితులు తండ్రి, బాబాయి కావడం విశేషం. దాంతో పరారీలో ఉన్న బాలుడి బాబాయి హరిహరన్ ను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News