: సీఆర్డీఏ పరిధిలోకి 58 మండలాలు
ఆంధ్రప్రదేశ్ లోని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)కు గవర్నర్ ఆమోదం తెలపడంతో, కృష్ణా, గుంటూరు జిల్లాలోని సీఆర్డీఏ పరిధిలోని 58 మండలాలను తీసుకువస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని పరిధి కింద కృష్ణా జిల్లాలో 29 మండలాలు, గుంటూరు జిల్లాలోని 29 మండలాలు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 17 మండలాలను సీఆర్డీఏ పరిథిలో పూర్తిగా కలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన 11 మంది సభ్యులతో సీఆర్డీఏ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.