: కొత్త ఎయిర్ పోర్టుల కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన లేఖ అందింది: అశోక్ గజపతిరాజు
తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టుల కోసం సీఎం కేసీఆర్ పంపిన లేఖ అందిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. వాటికి సంబంధించి ప్రతిపాదనల కోసం జవాబు ఇచ్చామన్నారు. కొత్త విమానాశ్రయం కావాలని ప్రతి రాష్ట్రం కోరుతోందని చెప్పారు. ఇక విజయవాడ విమానాశ్రయ విస్తరణకు భూ సేకరణ చేయాల్సి ఉందన్న మంత్రి, అందుకు కాలువ అడ్డంగా ఉందని చెప్పారు. కాలువను దారి మళ్లించాలన్నారు. విజయవాడను రాజధానిగా ప్రకటించాక మరింత రద్దీ పెరిగిందన్నారు. దేశంలో కొత్త టెర్మినల్స్ నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. కొత్త ఏవియేషన్ పాలసీపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్నామని వెల్లడించారు.