: బందీతో ఇంటర్వ్యూను ప్రచురించిన ఐఎస్ఐఎస్


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు తమ వద్ద బందీగా ఉన్న జోర్డాన్ పైలట్ మువాద్ అల్-కసాబే తో ఇంటర్వ్యూను తమ మాసపత్రిక 'దబీఖ్' లో ప్రచురించింది. ఉత్తర సిరియాలో గతవారం విమానం కూలిపోగా ఈ ఫస్ట్ లెఫ్టినెంట్ ను బందీగా పట్టుకున్నారు. తన ఎఫ్-16 విమానాన్ని ఓ క్షిపణి సాయంతో కూల్చివేశారని కసాబే పేర్కొన్నాడు. విమానం కూలిపోతుండడంతో సీట్ ఎజెక్షన్ వ్యవస్థ ద్వారా బయటపడ్డానని, పారాచూట్ యూఫ్రేట్స్ నదిలో ల్యాండైందని వివరించాడు. అక్కడే తనను ఐఎస్ఐఎస్ ఫైటర్లు అదుపులోకి తీసుకున్నారని ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, జోర్డాన్ విమానాన్ని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు కూల్చివేసిందనడాన్ని అమెరికా తోసిపుచ్చింది. కాగా, ఈ మ్యాగజైన్ ను సోమవారం ఆన్ లైన్ లో పోస్టు చేశారు. ఈ నెలలో సిడ్నీలో ఓ కేఫ్ పై జరిగిన దాడిని ఐఎస్ఐఎస్ ఈ మ్యాగజైన్ లో ప్రస్తుతించింది.

  • Loading...

More Telugu News