: షారుక్ ఖాన్ ఈజిప్ట్ అభిమానులకు శుభవార్త!


బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఈజిప్ట్ అభిమానులు ఈసారి కొత్త ఏడాదిని మరింత జోష్ తో జరుపుకోనున్నారు. బాద్షా నటించిన 'హ్యపీ న్యూ ఇయర్' ఈ నెల 31న ఈజిప్టులో విడుదలవబోతోంది. కైరో, అలెగ్జాండ్రియ, ఒబుర్ సిటీలోని పది ప్రధాన థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లలో సినిమాను ప్రదర్శించనున్నారు. యునైటెడ్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ చిత్రం... ఇంగ్లీష్, అరబిక్ సబ్ టైటిల్స్ తో ఈజిప్టులో ప్రేక్షకులను అలరించనుంది. అంతర్జాతీయ మార్కెట్లో తమ చిత్రానికి మంచి స్పందన లభించిందని షారుక్ కు చెందిన రెడ్ చిల్లీస్ సంస్థ సీఈవో వెంకీ మైసోర్ తెలిపారు. 'చెన్నై ఎక్స్ ప్రెస్' తరువాత ఈజిప్టులో విడుదలవుతున్న రెండవ రెడ్ చిల్లీస్ చిత్రం ఇదని చెప్పారు. అందుకే ఈజిప్టు అభిమానులు 'హ్యాపీ న్యూ ఇయర్' చూసి ఆనందిస్తారని భావిస్తున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News