: శాంతి భద్రతల విషయంలో మరింత కఠినం: నాయిని
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో నూతనంగా నిర్మించిన ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ ను నేటి ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు పెరిగేలా చూస్తామని వివరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.