: అనుష్కను కోహ్లీ భార్యగా పేర్కొన్న మాజీ క్రికెటర్


మెల్ బోర్న్ టెస్టు చివరి రోజు ఆట సందర్భంగా కామెంటరీ బాక్స్ నుంచి ఓ పొరబాటు దొర్లింది! వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆసీస్ మాజీ ఓపెనర్ మైకేల్ స్లేటర్ నటి అనుష్క శర్మను విరాట్ కోహ్లీ భార్యగా పేర్కొన్నాడు. అంతలోనే సర్దుకుని, "కోహ్లీకి కాబోయే భార్య"గా అభివర్ణించాడు. అనుష్క స్టాండ్స్ లో నిలబడి మైదానంలో ఉన్న కోహ్లీని, భారత జట్టును ఉత్సాహపరచడాన్ని గమనించిన స్లేటర్ ఆమె గురించి చెప్పే ప్రయత్నంలో ఈ విధంగా నాలుక్కరుచుకోవాల్సి వచ్చింది. కాగా, గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న కోహ్లీ, అనుష్క ఇటీవలే తమ బంధాన్ని అంగీకరించారు.

  • Loading...

More Telugu News