: విడదీసే రాజకీయాలకు స్వస్తి చెప్పండి... టీఆర్ఎస్ సర్కారుకు బీజేపీ హితవు


ప్రజలను విడదీసే రాజకీయాలకు ముగింపు చెప్పి... ఇక కొత్త రాష్ట్ర అభివృద్ధికోసం పాటు పడాలని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు టీఆర్ఎస్ ప్రభుత్వానికి హితవు చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో టీఆర్ఎస్ సర్కారు కలసి పనిచేయాలని ఆయన కోరారు. నల్గొండ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మురళీధరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో ఏర్పడిన అభద్రతా భావాన్ని తొలగిస్తేనే పెట్టుబడులు వస్తాయన్నారు. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో పనిచేయాలని ప్రభుత్వానికి సూచించారు.

  • Loading...

More Telugu News