: ఏనుగుల దాడిలో మహిళ మృతి


చిత్తూరు జిల్లాలో ఏనుగులు కలకలం సృష్టిస్తున్నాయి. వి.కోట మండలం కారగల్లులో ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందిన ఘటనను మరవక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. కుప్పం సరిహద్దుల్లో ఏనుగుల గుంపు చేసిన దాడిలో ఓబమ్మ (50) అనే మహిళ దుర్మరణం పాలైంది. పశువులను కాయడానికి అడవిలోకి వెళ్లిన ఆమెపై ఏనుగుల గుంపు ఆకస్మికంగా దాడి చేసింది. తొండంతో ఆమెను విసిరి వేయడమే కాకుండా, తొక్కి చంపేశాయి. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

  • Loading...

More Telugu News