: మీ పని మీరు చూస్కోండి, నా పని నేను చూస్కుంటా: సచిన్


రిటైర్మెంట్ పై వెల్లువెత్తున్న ప్రశ్నల ప్రవాహం గత కొంతకాలంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో తన వీడ్కోలు ఎప్పుడని ప్రశ్నిస్తోన్న విమర్శకులకు కటువుగా జవాబిచ్చాడు సచిన్. 'మీ పని మీరు చూస్కోండి, నా పని నేను చూస్కుంటా' అని మందలింపు ధోరణిలో వ్యాఖ్యానించాడు. సచిన్ నేడు ఢిల్లీలో జరిగిన ఓ ఈ-పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన రిటైర్మెంటుపై ఇతరులు వెలిబుచ్చే అభిప్రాయాల పట్ల తానేమీ బాధపడనని చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్ నుంచి ఎప్పుడు తప్పుకుంటావని 2005 నుంచి తనను ప్రశ్నిస్తూనే ఉన్నారని సచిన్ గుర్తు చేసుకున్నాడు. అలా అడిగిన వాళ్ళందరూ ఎవరి పని వారు చేసుకుంటే మంచిది కదా! అని చురక అంటించాడు. ఇక మీరు వార్తా పత్రికలు చదువుతారా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. 'నేను న్యూస్ పేపర్లు చదువుతూ కూర్చుంటే క్రికెట్ ఎవరు ఆడతారు!?' అని చమత్కరించాడు.

  • Loading...

More Telugu News