: తోకముడిచిన అమెరికా... పోరులో విజయం మాదే: ఆఫ్ఘన్ తాలిబాన్లు
తమను నాటో సైన్యం ఓడించలేకపోయిందని, అమెరికాతో తాము ఎటువంటి ఒప్పందం చేసుకోలేదని, తమతో పోరాడలేక చేతులెత్తేసిన సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పలాయనం చిత్తగించాయని తాలిబాన్ నేత జబియుల్ ముజాహిద్ అన్నారు. 13 సంవత్సరాల పాటు అమెరికా జరిపిన పోరులో విజయం తమదేనని ఆయన వివరించారు. 2001 నుంచి జరిగిన పోరులో 3,485 మంది సైనికులు చనిపోగా... వారిలో 2,356 మంది అమెరికాకు చెందినవారని తెలిపారు. కాగా, ఆఫ్ఘన్ భద్రతా అధికారాలను ఆ దేశ సైన్యం, పోలీసులకు అప్పగిస్తూ, అంతర్జాతీయ దళాలు దేశం వీడి వెళ్లేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.