: ఏషియన్ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రికి వెళ్లారు. చంద్రబాబు అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్యులు ఏఏ పరీక్షలు చేశారన్న విషయం తెలియరాలేదు. అయితే రొటీన్ లో భాగంగానే ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. నేటి ఉదయం ఎర్రమంజిల్ లోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రికి వచ్చిన చంద్రబాబు ఓపీ విభాగంలోనే వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆగస్టులోనూ ఆయన కేర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News