: ముల్లా ఒమర్ చావలేదు... కరాచీలోనే ఉన్నాడు
తాలిబన్ అగ్రనేత ముల్లా ఒమర్ మరణించలేదని... పాకిస్థాన్ లోని కరాచీలో ఉన్నాడని ఆఫ్ఘనిస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగం స్పష్టం చేసింది. ముల్లా ఒమర్ బతికే ఉన్నాడన్న విషయాన్ని తాము గట్టిగా విశ్వసిస్తున్నామని ఆఫ్ఘన్ ఇంటలిజెన్స్ యాక్టింగ్ చీఫ్ రహ్మతుల్లా నబిల్ స్పష్టం చేశారు. ఒమర్ బతికే ఉన్నాడంటూ ఇటీవల 'న్యూయార్క్ టైమ్స్' వెలువరించిన కథనాన్ని ఆయన సమర్థించారు. తాలిబన్లలో నెంబర్ టూ, ప్రస్తుత నాయకుడు ముల్లా అక్తర్ మహ్మద్ మన్సూర్ తో ఒమర్ సంబంధాలను కొనసాగిస్తున్నాడని తెలిపారు. ఒమర్ బతికే ఉన్నాడని తాలిబన్ సీనియర్ కమాండర్ మౌల్వీ నజీబుల్లా కూడా ఒప్పుకున్నాడు.