: బెజవాడ కమిషనరేట్ లోనే తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్: ఏపీ డీజీపీ రాముడు
నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు కానున్న తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ విజయవాడ పోలీస్ కమిషనరేట్ లోనే ఉంటుందని ఏపీ డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. రాజధాని నగరం స్మార్ట్ సిటీగా రూపొందనున్న నేపథ్యంలో తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ ను బెజవాడ కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. కమిషనరేట్ పరిధిని నిర్ణయించేది ప్రభుత్వమేనని తెలిపిన రాముడు, ఆయా జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించామన్నారు.